CRDA To bulit its permanent office in amaravati
తలమానికంగా.. సీఆర్డీయే సౌధం
25-02-2018 07:41:07
25-02-2018 07:41:07
- రూ.34 కోట్లతో సీఆర్డీయే పాలనా భవనాలు
- లింగాయపాలెం వద్ద ప్రధాన కార్యాలయం
- తుళ్లూరులో యూనిట్ కార్యాలయం
- మొదలైన నిర్మాణ పనులు
- ఆరు మాసాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యం
(మంగళగిరి, ఫిబ్రవరి 24): రాజధాని అమరావతి ప్రాంతంలో సీఆర్డీయే సొంత భవనాలను సమకూర్చుకుంటోంది. ఇప్పటివరకు విజయవాడ నగరంలోని లెనిన్ సెంటరు, బందరురోడ్డులలో కార్యాలయాలను నిర్వహించుకుంటున్న సీఆర్డీయే రాజధానిలో సొంతంగా ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మించుకుంటోంది. ఇందుకోసం ఆ సంస్థ రూ.34 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధికార యంత్రాంగాన్ని రాజధాని అమరావతిలోనే కేంద్రీకరించి పాలనను నడిపిస్తోంది. ఈ క్రమంలో సీఆర్డీయే కూడ సాధ్యమైనంత త్వరగా రాజధాని నుంచే విధులను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం తన ప్రధాన కార్యాలయాన్ని రాయపూడి - లింగాయపాలెం మధ్య సీడ్ యాక్సెస్‌రోడ్డు వెంబడే నాలుగెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకుంటుంది. సీఆర్డీయే ప్రధాన కార్యాలయ నిర్మాణం జరుగుతున్న ఈ ప్రదేశం భవిష్యత్తులో రాజధానిలోనే అతిపెద్ద జంక్షన్‌గా మారనుంది. సదరు జంక్షన్‌లో పూర్తి ఈశాన్యంగా ప్రధాన కార్యాలయం నిర్మితమవుతుంది. కార్యాలయానికి తూర్పువైపు ఎన్-11 రోడ్డు, ఉత్తరంగా సీడ్ యాక్సిస్ రోడ్డు(ఇ-3) ఉంటాయి.
Comments
Post a Comment